– ఆహ్వాన సంఘం అధ్యక్షురాలు సరళ మహేందర్ రెడ్డి బ్రోచర్ ఆవిష్కరణ
నవతెలంగాణ – కంఠేశ్వర్ : భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ నవంబర్ 26, 27, 28 తేదీలలో జరగబోయే జయప్రదం చేయాలని శ్రీమతి సరళ మహేందర్ రెడ్డి చే బ్రౌచర్ ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆహ్వాన సంఘం అధ్యక్షులు సరళ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ..ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ నిజామాబాద్ జిల్లాలో మొట్ట మొదటి సారిగా నిజామాబాద్ జిల్లాలో నిర్వహించడం శుభసూచకం అని అన్నారు. అదే విధంగా దేశంలో మహిళా సమస్యలను వెలిగెత్తి చాటడంలో ఎస్ఎఫ్ఐ ముందంజలో ఉందని అన్నారు. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రజినీకాంత్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటాలకు నిజామాబాద్ వేదిక కానుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు మానభంగాలు పెరుగుతున్న పరిస్థితి ఉందని షి టీం వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. అదేవిధంగా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న స్కూటీలను ఇవ్వాలని డిమాండ్ చేశారు . అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో విద్యార్థినిలకు మౌలికమైన వసతులను కల్పించాలని మరియు పౌష్టిక ఆహారాన్ని అందించాలని అన్నారు. ఎస్ఎఫ్ఐ ఈ కన్వెన్షన్ సందర్భంగా ఆడపిల్లలను పుట్టనిద్దాం చదవనిద్దాం ఎదగనిద్దాం కాపాడుకుందాం అని నినాదాన్ని విద్యార్థుల్లోకి తీసుకపోవడం జరుగుతుందని అన్నారు. ఈ కన్వెన్షన్ లో మహిళల సమస్యలపై అనేక తీర్మానాలను ప్రవేశ పెట్టబోతున్నామని అన్నారు. ఈ గర్ల్స్ కన్వెన్షన్ ప్రతి ఒక్కరూ ఆదరించి విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దీపిక, విగ్నేష్ లు జిల్లా నాయకులు రాజు, గోవింద్, బాలమణి, శిరీష, తదితరులు పాల్గొన్నారు.



