– మంత్రి కార్యాలయ ముట్టడి విజయవంతం చేయాలి
– జాతీయ మాలమహానాడు నియోజకవర్గ ఇంచార్జ్ అరె కిశోర్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
రోస్టర్ విధానంలో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని జీవో నంబర్ 99 ని తక్షణమే సవరించాలని జాతీయ మాలమహానాడు నియోజకవర్గ ఇంచార్జ్ అరె కిశోర్ డిమాండ్ చేశారు. శనివారం హుస్నాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో 119 ఎమ్మెల్యే కార్యాలయాలు ముట్టడించాలని జాతీయ మలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ పిలుపు నేపథ్యంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే,మంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి నియోజకవర్గం లోని మాలలు అందరూ కదిలి రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాలల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడన్నారు. గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జోడుముంతల వెంకటస్వామి, నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జ్ జాల శ్రీనివాస్ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు గంగాధర్, చిగురు మామిడి మండల బాధ్యులు బోలుమల్ల రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
రోస్టర్ విధానంలో మాలలకు తీవ్ర అన్యాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES