- Advertisement -
నవతెలంగాణ – ముంబయి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 నాటి మాలేగావ్ పేలుడు కేసులో ముంబయిలోని ఎన్ఐఏ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008 సెప్టెంబరు 29న చోటుచేసుకున్న పేలుడు తీవ్రతకు ఆరుగురు మృత్యువాతపడ్డారు. వంద మందికి పైగా గాయపడ్డారు. మాలేగావ్ పేలుడు కేసులో లోక్‌సభ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ తదితరులు నిందితులుగా ఉన్నారు. తాజా తీర్పుతో వీరందరికీ ఊరట లభించింది.
- Advertisement -