Saturday, August 2, 2025
E-PAPER
Homeబీజినెస్డాక్టర్‌ రెడ్డీస్‌లోని మల్లాది శ్రీకాంత్‌కు డాక్టరేట్‌

డాక్టర్‌ రెడ్డీస్‌లోని మల్లాది శ్రీకాంత్‌కు డాక్టరేట్‌

- Advertisement -

హైదరాబాద్‌ : నగరంలోని డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌ లిమిటెడ్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో లీడ్‌ ఎంప్లాయీ రిలేషన్స్‌ అండ్‌ ఇండిస్టియల్‌ రిలేషన్స్‌గా పనిచేస్తున్న మల్లాది శ్రీకాంత్‌కు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ లభించింది. గత 31 సంవత్సరాలుగా డాక్టర్‌ రెడ్డీస్‌లో పనిచేస్తున్న శ్రీకాంత్‌, విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంహెచ్‌ఆర్‌ఎం పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి, కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగంలో పరిశోధకుడిగా చేరారు. ప్రొఫెసర్‌ పుట్టపల్లి అరుణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ‘ఉద్యోగి జీవిత చక్ర నిర్వహణ మరియు సంస్థ పనితీరుపై దాని ప్రభావం (ఎంప్లాయి లైఫ్‌ సైకిల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇట్స్‌ ఇంపాక్ట్‌ ఆన్‌ ఆర్గనైజేషన్‌ పర్ఫామెన్స్‌)’పై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందారు. వైస్‌ చాన్సలర్‌ ఆచార్య జి.పి. రాజశేఖర్‌ చేతుల మీదుగా డాక్టరేట్‌ సర్టిఫికెట్‌ అందుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -