నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రానికి చెందిన రైతు దుంపల పెద్ద సాయన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి శనివారం సాయంత్రం మృతుని కుటుంబాన్ని పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుంపల పెద్ద సాయన్న మృతికి గల అనారోగ్యానికి గల కారణాలను కుటుంబ సభ్యులను ఆయన అడిగి తెలుసుకున్నారు.డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి వెంట బిజెపి మండల అధ్యక్షులు బద్దం రమేష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సున్నం మోహన్, మండల కార్యదర్శి ఆల్గోట్ బలరాం, బీజేవైఎం మండల అధ్యక్షుడు కొత్తపల్లి గణేష్, బిజెపి సీనియర్ నాయకులు రెంజర్ల గంగాధర్, నూకల మల్లేష్ యాదవ్, కొత్తపల్లి లక్ష్మీనర్సయ్య, చింత ప్రవీణ్, కొత్తపల్లి అరుణ్, లాచర్ల రాజేందర్, మండల కార్యవర్గ సభ్యులు శ్రీరాముల శ్రావణ్, కమ్మర్ పల్లి శక్తి కేంద్ర ఇంచార్జ్ లు పోల్కం నవీన్, చింత మణికంఠ, తదితరులు ఉన్నారు.
రైతు కుటుంబాన్ని పరామర్శించిన మల్లికార్జున్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES