Saturday, July 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మత్తు పదార్థాలు రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు..

మత్తు పదార్థాలు రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు..

- Advertisement -

ఎక్సైజ్ సీఐ పి.నరేందర్….
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
: మత్తు పదార్థాలు రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు, అతనికి ఆ పదార్థాలను అమ్మిన మరొక వ్యక్తిని అరెస్టు చేశారు. అనతరం రిమాండ్కు తరలించినట్లు ఎక్సైజ్ సీఐ నరేందర్ తెలిపారు. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..  జిల్లా కలెక్టర్  ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల, మత్తు పదార్థాల నియంత్రణ చర్యలలో భాగంగా జిల్లా ప్రోహిబిషన్ & ఎక్సైజ్  అధికారి విష్ణుమూర్తి  ఆధ్వరంలో  డిటిఎఫ్ భువనగిరి  ఎక్సైజ్ టీం  శుక్రవారం పిల్లాయిపల్లి గ్రామం పోచంపల్లి మండలం కి చెందిన సిద్దగోని రంగయ్య అనే వ్యక్తి  కల్లు లో కలిపే నిషేధిత మత్తు పదార్థం అయిన ” ఆల్ర్పజోలం ” ను రవాణా చేస్తుండగా మాటు వేసి పట్టుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని నుండి సుమారుగా (250) గ్రాముల  ఆల్ర్పజోలంను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం అతన్ని భువనగిరి స్టేషన్ కు తరలించారు. అతని పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండుకి పంపించినట్లు తెలిపారు. 

 సిద్దగోని రంగయ్య అట్టి మత్తు పదార్థం అయిన “ఆల్ర్పజోలం ” ను  రంగ శ్రీనివాస్, నుండి తెచ్చుతున్నానని విచారణలో భాగంగా అతను తెలిపాడు. దీంతో రంగ శ్రీనివాస్ పై కూడా కేసు నమోదు చేయడం జరిగిందనారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. ఈ సోదాలలో  డిటిఫ్ ప్రోహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, వారి  ‌సిబ్బంది  పాల్గొన్నారు. భువనగిరి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎవరైనా అక్రమంగా గంజాయిని,  డ్రగ్స్ ని విక్రయించిన, నిల్వ వుంచిన, మాదకద్రవ్యాలను, మత్తు పదార్థాలను  సేవించిన నేరం కాబట్టి అలాంటి వారి పై  కేసులు నమోదు చేసి  కఠిన చర్యలు తీస్కోవడం జరుగుతుందని  తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -