Wednesday, December 10, 2025
E-PAPER
Homeక్రైమ్Murder: ఎన్నికలవేళ వ్యక్తి దారుణ హత్య

Murder: ఎన్నికలవేళ వ్యక్తి దారుణ హత్య

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
రెండవ సాధారణ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలంలో రాంరెడ్డి పల్లి గ్రామంలో వ్యక్తి దారుణ హత్య మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సత్తయ్య (50) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. మృతుడికి అదే గ్రామానికి చెందిన లచ్చయ్య, దేవయ్యల మధ్య గత కొంతకాలంగా వ్యవసాయ భూమి దగ్గర దారి విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. మృతుడి భార్య అనుమానం మేరకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంపత్ కుమార్, ఎస్సై విజయ్ తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -