- Advertisement -
నవతెలంగాణ – నవాబు పేట
మండల పరిధిలోని యన్మంగండ్ల గుట్ట సమీపంలో గుర్తు తెలియని వ్యక్తిని దారుణంగా హత్యచేసి దుండగులు నిప్పుపెట్టారు. మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉండటంతో ఎలాంటి ఆనవాలు లేకుండా వ్యక్తి ఎవరో గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. స్థానికుల అందించిన సమాచారం అందిన వెంటనే డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎస్ఐ విక్రమ్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న పరిసరాలలో ఆనవాలు దొరుకుతాయేమోనని పరిశీలించారు. హత్యకు గల కారణాలను గుర్తించేందుకు పలురకాలుగా వివరాలు సేకరిస్తున్నారు.
- Advertisement -



