నవతెలంగాణ – పెద్దవంగర
ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై క్రాంతి కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లి గ్రామానికి చెందిన సుధగాని స్వరూప- కొండయ్య దంపతులకు అపర్ణ, అఖిల్ ఇద్దరు సంతానం. అఖిల్ గత నాలుగేళ్లు క్రితం ఓ ప్రమాదంలో మృతి చెందారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి గ్రామంలో తమకున్న ఐదెకరాల పొలం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం పొలం పనుల నిమిత్తం కొండయ్య (48) వెళ్లి, తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, చుట్టూ పక్కల వారికి అనుమానం వచ్చి అక్కడికి వెళ్లి చూడగా బావిలో మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు.
ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES