- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రూ. 600 కోసం హోటల్ సిబ్బంది దాడి చేయడంతో ఓ టూరిస్ట్ గైడ్ మృతి చెందిన ఘటన సరూర్ నగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా, వెల్దండ గ్రామానికి చెందిన విస్లావత్ శంకర్ నాయక్.. ఈ నెల 21న టూరిస్టుల కోసం కర్మన్‌ఘాట్ ఎన్ సెవెన్ హోటల్లో రూములు బుక్ చేశాడు. మర్నాడు గదులు ఖాళీ చేసే సమయంలో శంకర్ బిల్లులో రూ.600 తక్కువ ఇచ్చాడు. ఈ విషయమై గొడవ జరిగడంతో.. హోటల్ సిబ్బంది శంకర్ పై దాడి చేశారు. గాయపడిన శంకర్ ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
- Advertisement -



