– ఇషా హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళన
– రోడ్డు ప్రమాదం కారణంగానే మృతి
– ఇషా హాస్పిటల్ వైద్యుల ప్రకటన
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నంలోని నిషా హాస్పిటల్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన వ్యక్తికి సరైన వైద్యం అందక మృతి చెందాడు ఈ ఘటనపై ఆసుపత్రి వైద్య నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన దిగారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లి అనుబంధ గ్రామమైన మనోహరాబాద్ కు చెందిన హనుమన్ల పెంటయ్య (55) వృత్తి రిత్య సెంట్రింగ్ లేబర్. ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నం వచ్చిన ఆయన, మంచాల రోడ్డులో వెళుతుండగా కోళ్ల డీసీఎం ఢీ కొట్టింది. దాంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతన్ని 108లో ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలోని ఇషా హాస్పిటల్ కు తరలించి, చికిత్స అందిస్తున్నారు. సరైన వైద్యులు అందుబాటులో లేకపోవడంతో, అందులో ఉన్న కిందిస్థాయి సిబ్బంది చికిత్స అందించడంతో అస్వస్థతకు గురై అతను మృతి చెందాడు. వైద్యం వికటించడంతోననే మృతి చెందాడంటూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు, మున్నీరవుతున్నారు. ఆసుపత్రి ఎదుట ఆందోళన దిగారు. పలు టెస్టుల పేరుతే కాలయాపన చేశారని, సరైన సమయంలో వైద్యం అందించి ఉంటే ప్రాణం దక్కేది దక్కేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు కూడా అందుబాటు లేకున్నా క్షేత్రస్థాయి సిబ్బంది వైద్యం చేయడమే ప్రాణా నష్టం జరిగిందని ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీసులు ఆసుపత్రికి చేరుకొని ఇటు కుటుంబ సభ్యులు అటు ఆసుపత్రి యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు. జరిగిన ఘటనపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వైద్యం అందక వ్యక్తి మృతి
- Advertisement -
- Advertisement -



