మరొకరికి తీవ్రగాయాలు
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో ఘటన
నవతెలంగాణ – కామారెడ్డి
గణపతి విగ్రహం తరలిస్తుండగా కామారెడ్డి సిరిసిల్ల రహదారిపై 11కేవీ విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ షాక్ తో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మీనారాయణ (19) అక్కడికక్కడ మృతిచెందగా, సాయి (25) తీవ్ర గాయాలు కాగా వెంటనే అతనిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సిరిసిల్ల పట్టణంలోని విశ్వనాథ గణేష్ మండలి సభ్యులు ఆర్మూర్ మండలంలోని క్రికెట్ గ్రామంలో గణేష్ విగ్రహాన్ని కొనుగోలు చేసి అక్కడి నుంచి రాజన్న సిరిసిల్లకు తరలి స్తుండగా పాల్వంచ మండలం ఆరేపల్లి గ్రామ స్టేజి వద్ద ఈ ప్రమాదం జరిగింది. విగ్రహం ఎత్తు ఎక్కువగా ఉండడం వల్ల వైరుకు తగిలి ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. షాక్ తగిలిన వెంటనే ఇద్దరు యువకులు అపస్మారక స్థితిలో పడిపోయారు. వారిని కాపాడడానికి స్థానికులు సిపిఆర్ చేసినా ఫలితం లేకపోయింది. మాచారెడ్డి ఎస్ఐ అనిల్ ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.
గణపతి విగ్రహం తరలిస్తుండగా కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES