Tuesday, October 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅమ్మవారి ఊరేగింపులో భార్యతో డ్యాన్స్ చేస్తూ హఠాన్మరణం

అమ్మవారి ఊరేగింపులో భార్యతో డ్యాన్స్ చేస్తూ హఠాన్మరణం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అమ్మవారి ఊరేగింపులో భార్యతో కలిసి నృత్యం చేస్తూ ఓ వ్యక్తి హఠాన్మరణం చెందిన సంఘటన విశాఖ‌ప‌ట్నం పెందుర్తి మండలంలోని పెదగాడి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అప్పికొండ త్రినాథ్‌ (56) డ్రైవర్‌గా పని చేస్తుంటారు. ఈయనకు భార్య లక్ష్మీ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అమ్మవారి నిమజ్జనం సందర్భంగా ఆదివారం రాత్రి జరిగిన ఊరేగింపులో త్రినాథ్, లక్ష్మీ ఉత్సాహంగా నృత్యం చేశారు. పాట పూర్తయిన వెంటనే త్రినాథ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గ్రామస్థులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో పండగ వేళ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై ఎటువంటి ఫిర్యాదులు అందలేదని పెందుర్తి సీఐ కె.వి.సతీశ్‌కుమార్‌ తెలిపారు. కాగా, డీజే శబ్దాలకు త్రినాథ్‌ గుండె ఆగినట్లు స్థానికంగా చర్చ సాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -