నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని ఐదవ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష పడిందని ఐదవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గంగాధర్ గురువారం తెలిపారు. ఎస్సై గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఐదవ పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 12వ తేదీ వరుణ చౌరస్తాలో ఎస్సై గంగాధర్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిం ఆ వ్యక్తికిచారు. అందులో భాగంగా మాట్లాడుకు చెందిన షేక్ కాజా మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడ్డాడు.పట్టుబడిన వ్యక్తిని బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేసి మద్యం సేవించినట్లు నిర్దారించి, కోర్టు యందు ప్రవేశ పెట్టగా గౌరవ మేజిస్ట్రేట్ ఐదు రోజులు జైలు శిక్ష విధించారు. పైన తెలిపిన వ్యక్తిని జైలు కు తరలించామని ఎస్ఐ తెలిపారు. పట్టణ పరిధిలో ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే వారికీ 10,000/- వరకు జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండు కూడా విదించే అవకాశం ఉంది కావున ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడుపవద్దు అని పోలీస్ వారి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ లో వ్యక్తికి జైలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



