- Advertisement -
నవతెలంగాణ – నవాబుపేట: మధ్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి 8రోజుల జైలు శిక్ష విధిస్తూ బుధవారం రోజు జిల్లా కోర్టు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ శశిధర్ ఆదేశించారు అని ఎస్ఐ విక్రం తెలిపారు. మండల కేంద్రానికి చెందిన దర్శనం రాఘవేందర్ తండ్రి సత్యనారాయణ అను వ్యక్తి మద్యం త్రాగి వాహనం నడిపినందుకు 8 రోజుల జైలు శిక్ష విధించి చట్టపరమైనా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ విక్రం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యం సేవించి వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అని ప్రమాదాలు అరికట్టేందుకు ఇలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
- Advertisement -