- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
డ్రంక్ అండ్ డ్రైవ్ లో వ్యక్తికి 2 రోజులు జైలు శిక్ష, జరిమానా విధించడం జరిగిందని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. సోమవారం రాత్రి వాహనాల తనిఖీలలో భాగంగా టోల్ ప్లాజా వద్ద మద్యం సేవించి వాహనం నడుపుతున్న వ్యక్తికి జరిమానా విధించి జైలుకు పంపించడం జరిగింది అని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే శాఖాపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
- Advertisement -