నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండలం, తాడికల్ గ్రామ సమీపంలో జరిగిన మోటార్‌సైకిల్ ప్రమాదంలో కరీంనగర్‌కు చెందిన గోల్లపల్లి తరుణ్ (27) తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం కరీంనగర్ నుండి వరంగల్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.తరుణ్ తన స్నేహితుడు అరవింద్‌తో కలిసి ఒక బైక్‌పై, మరో ఇద్దరు స్నేహితులు మరో బైక్‌పై మొత్తం నలుగురు ప్రయాణిస్తున్నారు. తాడికల్ గ్రామంలోని రైస్ మిల్ వద్ద వీరి మోటార్‌సైకిల్ అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో తరుణ్ తలకు బలమైన గాయం అవ్వగా, చేతులు, కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే, అరవింద్ సురక్షితంగా ఉన్నాడు.వెంటనే స్పందించిన అరవింద్, 108కి ఫోన్ చేయగా, ఈఎంటి గూడూరి సతీష్ రెడ్డి మరియు పైలెట్ ఎం. గోపికృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు తరుణ్‌కు ప్రథమ చికిత్స అందించి, చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బైక్ ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES