- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ‘మన శంకరవరప్రసాద్ గారు’ ట్రైలర్ వచ్చేసింది. చిరంజీవి, నయనతార హీరోహీరోయిన్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్‌గారు’. వెంకటేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టచ్‌తో పాటు, చిరు అభిమానులు మెచ్చేలా యాక్షన్ హంగులను సినిమాకు జోడించినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది.
- Advertisement -



