నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పూజారి శేఖర్ ఏర్పాటు చేసిన గ్రామీణ హోం ఫుడ్స్ షాప్ ను రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి నూతనంగా ఏర్పాటుచేసిన షాపును ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేలా నాణ్యమైన పిండి వంటలు, పచ్చళ్ళు తదితర ఆహార పదార్థాలతో కూడిన షాపును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆయన షాపులో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆడెం గంగ ప్రసాద్, మైనార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ రఫీ, వేల్పూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు నర్సారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి గిర్మాజీ గోపి, కమ్మర్ పల్లి టౌన్ ప్రెసిడెంట్ గణేష్, నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూమరెడ్డి, కమ్మర్ పల్లి యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ శైలేందర్, తదితరులు పాల్గొన్నారు.
కమ్మర్ పల్లిలో గ్రామీణ హోం ఫుడ్స్ షాప్ ప్రారంభించిన మానాల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES