వైవిధ్యమైన సినిమాలు, భిన్న పాత్రలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న మంచు మనోజ్ కొత్త ప్రయాణాన్ని ఆరంభించారు. కొత్త మ్యూజిక్ ప్రాజెక్ట్ ‘మోహన రాగ మ్యూజిక్’ను స్టార్ట్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రారంభం నుంచి మంచు మనోజ్ జీవితంలో సంగీతం అనేది ఓ అంతర్భాగంగా ఉంటోంది. ‘పోటుగాడు’ సినిమాలో ‘ప్యార్ మే పడిపోయానే..’ పాటను పాడి ప్రేక్షకులను మెప్పించారు. కోవిడ్ సమయంలో అందరినీ ఉత్తేజ పరిచేలా ‘అంతా బాగుంటాంరా’ పాటను విడుదల చేశారు. ‘మిస్టర్ నూకయ్య’, ‘నేను మీకు తెలుసా’ వంటి సినిమాల్లోని పాటలకు సాహిత్యాన్ని అందించారు. మనోజ్ తన సినీ ప్రయాణంలో తండ్రి డా.మంచు మోహన్ బాబు, అన్నయ్య మంచు విష్ణు, సోదరి లక్ష్మి మంచు చిత్రాలకు సంగీత విభాగంలో వర్క్ చేయటంతో పాటు వారి చిత్రాలకు యాక్షన్ సన్నివేశాలను డైరెక్ట్ కూడా చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో తన గుర్తింపును పెంచుకుంటూ మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణితో కలిసి హాలీవుడ్ సినిమా ‘బాస్మతి బ్లూస్’కు సంగీతాన్ని అందించారు. ‘మోహన రాగ మ్యూజిక్’ అనేది కొత్త ఆలోచనలు, భావోద్వేగాలను కలిపే వేదిక. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటం, ప్రయోగాత్మక సంగీతాన్ని ప్రోత్సహించటం..భారతీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల హదయాలను హత్తుకునేలా సరికొత్త సంగీతాన్ని రూపొందించటమే దీని ప్రధాన లక్ష్యం. ఈ పేరుకీ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. తండ్రీ కొడుకులిద్దరికీ అత్యంత ఇష్టమైన రాగం – మోహన రాగం. ఒరిజినల్ సింగిల్స్, కొలాబ్రేషన్స్, కొత్తరకమైన మ్యూజిక్ ప్రాజెక్ట్స్ ఈ లేబల్ నుంచి రాబోతున్నాయి. మోహన రాగ మ్యూజిక్ కంపెనీతో జరగబోయే అతి పెద్ద ఇంటర్నేషనల్ కొలాబ్రేషన్ గురించి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఇది తెలుగు సంగీతాన్ని ప్రపంచ వేదిక పైకి తీసుకెళ్లే కీలకమైన పరిణామంగా నిలుస్తుందనటంలో అతిశయోక్తి లేదు.
మంచు మనోజ్ కొత్త ప్రయాణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



