నవతెలంగాణ మద్నూర్ : నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్ పథకం కింద పంపిణీ చేసిన సోయాబీన్ సాగుచేసిన పంట సాగు చేనులను మండల వ్యవసాయ అధికారి రాజు మంగళవారం పరిశీలించారు. మద్నూర్ మండలంలోని మెనూర్, దొంగిలి మండలంలోని మొగ గ్రామాలలో ఎన్ ఎం ఈ ఓ ( నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్ – పథకం కింద సోయాబీన్ విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది.
రైతులకు ఈ పథకం ద్వారా డి ఎస్ బి 34 రకం సోయాబీన్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పంట శాఖియా దశలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. రైతులు కలుపు మందులు, పురుగు మందుల తగిన సమాచారాన్ని వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకోనీ అవసరం మేరకే మందు పిచికారి చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో విశాల్ గౌడ్ , రైతులు పాల్గొన్నారు.