- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ఇటీవల జిల్లా వైద్యారోగ్య శాఖ ఉప అధికారిగా పదోన్నతి పొంది పదవి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఎన్.రవీందర్ ను మండల అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు మంగళవారం ఆయనను వారి కార్యాలయంలో కమ్మర్ పల్లి మండల అంబెడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కలిసి జిల్లా వైద్యారోగ్య శాఖ ఉప అధికారిగా పదోన్నతి పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేశారు.కార్యక్రమంలో మండల అంబెడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సుంకరి విజయ్ కుమార్, మండల అంబెడ్కర్ యువజన సంఘం కార్యవర్గ సభ్యులు దాసరి రాకేష్,, వినయ్, ఆంజనేయులు, అనిల్, అమర్, చందు ,శ్రవణ్, నరేశ్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



