నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని చౌట్ పల్లి పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మండల స్థాయి బోధనాభ్యసన పరికరాల ( టిఎల్ఎం) మేళా నిర్వహించారు. మేళాను మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్, తహసీల్దార్ గుడిమేల ప్రసాద్, ఎస్ఐ అనిల్ రెడ్డి ముఖ్య అతిథిలుగా పాల్గొని ప్రారంభించారు. ఈ మేళాకు మండలంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ఎంతో వినూత్నమైనటువంటి, విద్యార్థులను ఆకట్టుకునేలా బోధనాభ్యసన పరికరాలను తయారుచేసి ఈ మేళాలో ప్రదర్శించారు. ఈ మేళాలో ప్రదర్శించిన బోధనాభ్యసన పరికరాలను పరిశీలించి ప్రతి సబ్జెక్టు నుండి రెండు ఉత్తమ బోధనాభ్యసన పరికరాలను జిల్లాస్థాయికి ఎంపిక చేశారు.
మండల స్థాయిలో ఎంపిక కాబడిన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు జిల్లా స్థాయిలో జరగబోయే మేళాకు హాజరు కావాల్సి ఉంటుందని మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మండల స్థాయిలో ఎంపికైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల వివరాలను వెల్లడించారు.తెలుగులో నాగమణి(ఎస్ జిటి, ఎంపీపీఎస్-కోనాసమందర్), అంజాద్ సుల్తాన్ ( ఎంపీయుపిఎస్, ప్యాట-హాస కొత్తూర్), ఆంగ్లంలో జి. సుజాత (ఎంపీపీఎస్- బాలికల, కమ్మర్ పల్లి), జి.శ్యామల (ఎంపీపీఎస్, కమ్మర్ పల్లి), వై.మంజుల(ఎంపీపీఎస్, కేసీ తండా ), గణితంలో గంగామణి ( ఎంపిహెచ్ఎస్, అమీర్ నగర్), టి.మహేష్ ( ఎంపీపీఎస్, ఎస్సీ వాడ బషీరాబాద్), ఈవీఎస్ లో
కే.కావ్య( ఎంపీపీఎస్, నర్సాపూర్), బి.రంజిత్ (ఎంపీపీఎస్, మారుతి నగర్), ఎన్.మారుతి (ఎంపీపీఎస్, చౌట్ పల్లి) గెలుపొందినట్లు ఆయన తెలిపారు. గెలుపొందిన అందరికీ ప్రశంసా పత్రాలతో పాటు మెమొంటో లను మండల విద్యాధికారి ఆంధ్రయ్య చేతుల మీదుగా అందచేశారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్, రాజన్న, మండల రిసోర్స్ పర్సన్స్ చంద్ర శేఖర్, రవీందర్, వేణు, అశోక్, ప్రసాద్, సంతోష్, శంకర్ గౌడ్, మారుతి, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, తదితరులు పాల్గొన్నారు.