Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మండల స్థాయి టిఎల్ఎం మేళా.!

మండల స్థాయి టిఎల్ఎం మేళా.!

- Advertisement -

మండల విద్యాధికారి జి.లక్ష్మన్ బాబు
నవతెలంగాణ – మల్హర్  రావు

మండలం వళ్లెంకుంట గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం మండల స్థాయి (టిఎల్ఎం)టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళా ప్రదర్శన కార్యక్రమాన్నీ నిర్వహించినట్లుగా మండల విద్యాధికారి జి. లక్ష్మన్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైమరీ,అప్పర్ ప్రైమరీ స్కూల్స్ నుండి 35 మంది టీచర్లు 209 కృత్యాలు ప్రదర్శించడం జరిగిందన్నారు. మినిమం రెండు,మ్యాగ్జిమo 10 వరకు టిఎల్ఎం బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. ఈటిఎల్ఎం నుండి దాబెస్ట్ బాగా తయారు చేసిన టాప్ 10 టిఎల్ఎంలను సెలెక్ట్ చేసి జిల్లా స్థాయి టీఎల్ఎం మేళాకు పంపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు సుదర్శనం, తిరుపతి, పీజీ హెచ్ఎంలు బి.తిరుపతి, నర్సింగరావు, ఈటిఎల్ఎం మేళాకు జడ్జిలుగా రఘునందన్, గణేష్ వ్యవహరించారు. ఆర్గనైజర్స్ మధుసూదన్, మహిపాల్, చంద్రశేఖర్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, ఎంఆర్సి స్టాప్, సిఆర్పిలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad