Tuesday, July 29, 2025
E-PAPER
Homeజిల్లాలుసమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్న మండల అధికారి

సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్న మండల అధికారి

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : సమాచార హక్కు చట్టాన్ని మండల అధికారి నిర్లక్ష్యం చేస్తున్నారని పిడిఎస్యు నాయకులు అనిల్ సోమవారం ఆరోపించారు. విద్యార్థి సంఘం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థపై సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్టిఐ వేస్తే అందుకు సంబంధించినటువంటి అసంపూర్త సమాచారాన్ని ఇవ్వడం విడ్డూరం అని అన్నారు. భారతీయ పౌరులకు సమాచార హక్కు చట్టం కల్పించడం గొప్ప విషయం అయితే ఆ హక్కుని ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేయడంపై మండల విద్యాశాఖ అధికారితో మాట్లాడితే వారు ఏది ఇస్తే మేము అదే ఇస్తాం మీకు అవసరమైతే ఆపిల్ కి వెళ్ళండి అని వాదన చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో ప్రవేట్, కార్పొరేట్ విద్య సంస్థలకు మండల విద్యాశాఖ అధికారి వత్తాసు పలుకుతుండు అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఈ ఘటనాలపై జిల్లా విద్యాశాఖ అధికారి  స్పందించాలని  డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -