Sunday, November 2, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంన్యూయార్క్‌ మేయర్‌ రేసులో మాందానీ ముందంజ

న్యూయార్క్‌ మేయర్‌ రేసులో మాందానీ ముందంజ

- Advertisement -

న్యూయార్క్‌ : ఈ నెల నాలుగో తేదీన జరగనున్న న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నిక కోసం రిపబ్లికన్‌, డెమొక్రాట్‌ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థి ఆండ్రూ క్యూమో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. డెమొక్రాట్‌ అభ్యర్థిగా మందానీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. జూన్‌లో జరిగిన పార్టీ ప్రైమరీ ఎన్నికలో ఆయన అనూహ్యంగా విజయం సాధించి పార్టీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారు. మేయర్‌ రేసులో ప్రత్యర్థి కంటే ఆయన ముందున్నారని పోల్‌ సర్వేలు చెబుతున్నాయి. ఆయన మద్దతుదారులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం సాగిస్తున్నారు. అపార్ట్‌మెంట్లలో అద్దెలపై పరిమితి విధిస్తానని, ఉచిత బస్సులు నడుపుతానని, చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి సారిస్తానని, సంపన్నులు, కార్పొరేట్‌ సంస్థలపై పన్నులు పెంచుతానని మాందానీ హామీ ఇచ్చారు. అపార్ట్‌మెంట్లలో అద్దెలు పెరగకుండా చూస్తానని ఆయన ఇచ్చిన హామీ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది. గాజాలో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణహోమాన్ని పలువురు న్యూయార్క్‌ వాసులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇజ్రాయిల్‌కు అమెరికా మద్దతు ఇవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాందానీతో తలపడుతున్న స్వతంత్ర అభ్యర్థి ఆండ్రూ క్యూమో గతంలో న్యూయార్క్‌ గవర్నరుగా పనిచేశారు. ఆయన ప్రచారం కూడా జోరుగానే సాగుతోంది. అయితే లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా ఆయన 2011లో గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆయన మాందానీపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. క్యూమో కూడా డెమొక్రాటే. ప్రైమరీ ఎన్నికలో ఆయన వెనుకబడిపోవడంతో మాందానీ బరిలో దిగారు. దీంతో క్యూమో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రిపబ్లికన్‌ పార్టీ కర్టిస్‌ స్లివాను పోటీకి నిలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -