Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుబర్త్ డే వేడుకల్లో గంజాయి..స్పందించిన మంగ్లీ

బర్త్ డే వేడుకల్లో గంజాయి..స్పందించిన మంగ్లీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ జానపద గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఆమె తాజాగా స్పదించారు. తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చింది. నా పుట్టినరోజు వేడుకను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలనే ఉద్దేశంతో మా అమ్మానాన్నల కోరిక మేరకు కుటుంబ సభ్యులు, బంధువులతో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మా కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు కూడా ఉన్నారు. మద్యం, సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. మద్యం, సౌండ్ సిస్టమ్‌కు అనుమతి తీసుకోవాలనే విషయంపై నాకు అవగాహన లేదు. రిసార్ట్‌లో పార్టీ అనుకోకుండా సడన్‌గా ప్లాన్ చేసుకోవడం జరిగింది. తెలిసి అయితే నేను ఎలాంటి తప్పు చేయలేదు. రిసార్ట్‌లో లోకల్ లిక్కర్ తప్ప ఎలాంటి ఇతర మత్తు పదార్థాలు అక్కడ లేవు, వాడలేదు.మీడియా మిత్రులకు నా విన్నపం.. దయచేసి ఆధారాలు లేని అభియోగాలు నాపై మోపొద్దు.. ప్లీజ్‌’ అంటూ మంగ్లీ వీడియో విడుదల చేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad