– టీచర్, పిల్లలు ప్రభుత్వ బడిలోనే :నవీన్ నికోలస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తాను పని చేస్తున్న ప్రభుత్వ బడిలోనే తన పిల్లలను చేర్పించిన ఫిజికల్ డైరెక్టర్ పి.మణి తీసుకున్న నిర్ణయం ఆదర్శప్రాయమని పాఠశాల విద్య సంచాలకులు నవీన్ నికోలస్ ప్రశంసించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా రామన్నపేట్ మండలం, ఇంద్రపాలనగరం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఫిజకల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మణి తన ఇద్దరు పిల్లలు కుమారి పి.అనీక్ష (6వ తరగతి), కుమారుడు మాస్టర్ హరిరామ్ (3వ తరగతి) అదే ప్రభుత్వ బడిలో చేర్పించారు. ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో మణిని నవీన్ నికోలస్ ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా నవీన్ నికోలస్ మాట్లాడుతూ విద్యావంతులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వ విద్య పట్ల ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల్లో, సమాజంలో స్ఫూర్తినిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య, విలువలు, సమగ్ర అభివృద్ధి అందుతుందని సమాజానికి అర్థం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో టీచర్ మణి ఆదర్శప్రాయమైన ప్రమాణాలు నెలకొల్పారని అభినందించారు.
మణి నిర్ణయం ఆదర్శప్రాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



