Sunday, August 3, 2025
E-PAPER
Homeఖమ్మంమన్నెం సుందరయ్య.. సున్నం రాజయ్య: సీపీఐ(ఎం) నేత పుల్లయ్య

మన్నెం సుందరయ్య.. సున్నం రాజయ్య: సీపీఐ(ఎం) నేత పుల్లయ్య

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆదివాసి ముద్దుబిడ్డ, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మన్నెం సుందరయ్య అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు. ఆయన ఐదో వర్ధంతి సభను ఆదివారం మండల వ్యాప్తంగా నిర్వహించారు. నియోజక వర్గం కేంద్రం అశ్వారావుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ లో మండల కార్యదర్శి సోడెం ప్రసాదరావు అద్యక్షతన  సీపీఐ(ఎం) అశ్వారావుపేట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా హాజరైన పుల్లయ్య రాజయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు. మావోయిస్టులకు ఎదురొడ్డి పోరాడిన రాజయ్య ఆయన తుది శ్వాస వరకు గిరిజనులు పక్షాన నిలబడ్డారు అని కొనియాడారు. ఎమ్మెల్యే గా భద్రాచలం ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఘనత సుందరయ్య దేనని అన్నారు. నందిపాడు, పండువారిగూడెం, గుంటిమడుగు, దబ్బతోగు, కోయ రంగాపురం శాఖల ఆధ్వర్యంలో నూ రాజయ్య వర్ధంతిని నిర్వహించారు.

ఈ కార్యక్రమాల్లో జిల్లా  కమిటీ సభ్యులు చిరంజీవి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు ముల్లగిరి గంగరాజు, మడిపల్లి వెంకటేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు ఏసు శాఖా కార్యదర్శులు  నాగేందర్ రావు రాంబాబు,రమేష్,ఖాసీం, మడకం నాగేశ్వరరావు, సూరిబాబు, గోవిందరావు, దుర్గారావు, సీసం నాగేశ్వరరావు, రమేష్, అర్జున్, సంకేతాలు, శోభన్, కన్నయ్య, దానయ్య, కార్యకర్తలు సానుభూతిపరులు, అభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -