నవతెలంగాణ – బజార్ హాత్నూర్
మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ గోడం నాగేష్ శ్రీకారం చుట్టారు. శనివారం మండలంలోని అందుగూడ గ్రామపంచాయతీ నూతన భవనాన్ని, గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి, గోకుండా గ్రామపంచాయతీ పరిధిలో నూతన పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నాగేష్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోని ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి పలు పథకాలు ప్రవేశపెట్టరని తెలిపారు. ఈ పథకల ద్వారా మరో ఐదేండ్లలో గిరిజన ప్రాంతాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లు, బిజెపి నాయకులు ఆల్క గణేష్, నానం రమణ, సూది నందు, సుఖదేవ్, రాజేశ్వర్, వెంకన్నా, భోజన్న, ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



