– అంతిమయాత్ర.. కేఎంసీకి భౌతికకాయం అప్పగింత
– ప్రజాస్వామ్యవాదులకు తీరని లోటు : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
ప్రముఖ రచయిత్రి, అఖిల భారత ప్రజా రచయిత్రుల సంఘం అధ్యక్షులు అనిశెట్టి రజిత(65) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతిచెం దారు. మంగళవారం అంతిమయాత్ర నిర్వహించి.. ఆమె భౌతికకాయాన్ని వరంగల్‌లోని కేఎంసీకి కుటుంబసభ్యులు అప్పగించారు. అంతిమయాత్రలో కవులు, రచయితలు, మేధావులు, ఆయా రాజకీయ పార్టీల నేతలు, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. హనుమకొండ రెడ్డికాలనీలోని స్వగృహంలో ఆమె భౌతికకాయాన్ని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎం. చుక్కయ్య, తదితరులు సందర్శించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చుక్కయ్య మాట్లాడుతూ.. అనిశెట్టి రజిత రచనలు ప్రజలను చైతన్య పరిచేవని, రచయిత్రిగా వందలాది కవితలు, ఉపన్యాసాలు చేశారని అన్నారు. ఆమె మరణం ప్రజాస్వామ్యవాదులకు తీరని లోటని, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ తరఫున ఆమె మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు రమాదేవి, రచయితలు విద్యా దేవి, డాక్టర్ చంద్రబాను, బన్న ఐలయ్య, అవయవ దాన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
రచయిత్రి అనిశెట్టి రజితకు పలువురు నివాళి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES