Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ పార్టీలోకి పలువురి చేరికలు 

కాంగ్రెస్ పార్టీలోకి పలువురి చేరికలు 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట 
కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అశోక్ మండలంలోని ముద్దులగూడెం గ్రామానికి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ విధివిధానాలు అభివృద్ధి నచ్చి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారిని డిసిసి అధ్యక్షులు పైడాకుల  అశోక్ సాధారంగా కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. మోదులగూడెం గ్రామానికి చెందిన తుడుసుకు కుమార్ కత్తుల రాజాలు ఎలగందుల మొగిలి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు.

గత రెండు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలు మరియు రేవంత్ రెడ్డి  చేస్తున్న ప్రజా పాలనను ఆదర్శంగా తీసుకుని ములుగు నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని నమ్మి మొద్దులగూడెం గ్రామం నుండి బి.ఆర్.ఎస్.పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ములుగు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మంత్రి సీతక్క గారని, సీతక్క  అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలోనే ఎన్నో అభివృద్ధి పథకాలతో ముందుకు తీసుకుపోతుంది అని అన్నారు.

ములుగు జిల్లాలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే సీతక్క గారి లక్ష్యం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విధి, విధానాలు, కొనసాగిస్తున్న ప్రజా పాలనను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి క్యూ కడుతున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు చూస్తున్నారని గ్రహించి, బి.ఆర్.ఎస్.పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, మండల యూత్ అధ్యక్షులు చింత క్రాంతి, సీనియర్ నాయకులు కణతల నాగేందర్ రావు, తండా రవి, వాసం శ్రావణ్, చింతపండు లక్ష్మీనారాయణ, ఇర్ప విజయ తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -