నవతెలంగాణ – మల్హర్ రావు
మావోయిస్టు పార్టీలో అగ్రనేతల సరెండర్ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర సీఎం ఎదుట ఆయుధాలతో లొంగిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు ఆశన్న టీమ్ కూడా జద్గల్‌పూర్‌లో వివిధ కేడర్లతో సరెండర్ అవుతారంటూ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ మాజీ సింగరేణి కార్మిక సమాఖ్య కార్యదర్శి, మావోయిస్టు పార్టీ తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ కాసేపట్లో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోనున్నారు. 40 ఏళ్లకు పైగా దండకారణ్యంలో ఉన్న బెల్లంపల్లి వాసి అయిన ప్రకాశ్ తీవ్ర అనారోగ్యం కారణంగా పార్టీ నుంచి బయటకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా మావోయిస్టు అనుబంధ సంస్థగా ముద్ర పడిన సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) ఇటీవల ఆయుధాలు వీడాలన్న మల్లోజుల వేణుగోపాల్ వాదనను ప్రకాశ్ సమర్ధించిన అందరికీ విషయం తెలిసిందే.
మావోయిస్టు కీలకనేత బండి ప్రకాశ్ సురేండర్.?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES