ఆయన భార్యతో సహా ఆరుగురు మావోయిస్టులు హతం
అతనిపై రూ. ఆరు కోట్ల రివార్డు.
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో ఘటన
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మోస్ట్‌వాం టెడ్ మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా మృతి చెందాడు. ఆయన భార్యతో కలిపి ఆరుగు రు హతమయ్యారు. మృతి చెందిన హిడ్మా సెంట్రల్ కమిటీ సభ్యుడు కాగా, ఆయన భార్య మడకం రాజే అలియాస్ రాజక్క డివిజన్ కమిటీ మెంబర్‌గా కొనసా గుతున్నారు. మృతి చెందినవారిలో చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్, మల్లా, దేవే ఉన్నారు.
నెలరోజులుగా భారీ కూంబింగ్
భద్రతా బలగాలు ఆపరేషన్ హిడ్మా పేరిట ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. హిడ్మా కోసం గత నెలరోజులుగా భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఆ ప్రాంతం లో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతున్నట్టు ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం నేపథ్యంలో కూంబింగ్ నిర్వహించినట్టు చెప్పారు. ప్రస్తుతం మావోయిస్టుల్లో ఉన్న మిగిలిన కీలక నేతల కోసం కూడా గాలిస్తున్నట్టు భద్రతా బలగాలు తెలిపాయి. ఘటనాస్థలి వద్ద అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్, డీఐజీ గోపీనాథ్ జెట్టి ఉన్నారు.
హిడ్మా అలియాస్ సంతోష్ ఎవరు?
ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని పూర్వాటి గ్రామంలో జన్మించిన హిడ్మా 17 ఏండ్ల వయసులోనే మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితుడై పార్టీలో చేరాడు. మురియా తెగకు చెందిన ఆయనకు ఆంగ్లం, హిందీ, గోండు, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో ప్రావీణ్యం ఉంది. దండ కారణ్యంలో పార్టీ శ్రేణుల్ని ముందుండి నడిపించడంలో ఆరితేరాడు. భారీ దాడులకు వ్యూహ కర్తగా గుర్తింపు పొందాడు. బస్తర్ ప్రాంతంలో దళంలో కీలక సభ్యుడిగా మారాడు. చిన్నవయసులోనే మావో యిస్టు కేంద్ర కమిటీ సభ్యుడయ్యాడు. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరు సంపాదించుకున్నాడు. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్‌గా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగానూ పనిచేశాడు.
రూ.6 కోట్ల రివార్డు
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా చేసిన హిడ్మా రెండు దశాబ్దాల్లో జరిగిన మావోయిస్టు కీలకదాడులకు సూత్రధారిగా గుర్తింపు పొందాడు. దంతేవాడ, సుక్మా పరిధిలో 30కి పైగా భారీ దాడులకు ఈయనే నేతృత్వం వహించారు. వీటిని దృష్టిలో ఉంచుకుని పలు రాష్ట్ర ప్రభుత్వాలు హిడ్మా పై రూ.6 కోట్ల వరకు రివార్డు ప్రకటించాయి.
ఛత్తీస్‌గఢ్‌లోనూ ఎదురుకాల్పులు
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోనూ ఎదురుకాల్పులు జరిగాయి. మంగళ వారం ఉదయం ఎర్రబోరు ప్రాంతంలో మావోయిస్టులు – భద్రతా బలగాల మద్య జరిగిన కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఆ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టు జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు.
27 మంది మావోయిస్టుల అరెస్ట్
మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్టు ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్‌చంద్ర లడ్హా తెలిపారు. దీనితో పాటు ఏపీలోని కృష్ణా జిల్లా విజయవాడలోనూ, కాకినాడలోనూ మొత్తం 27 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. అరెస్టు అయిన వారిలో 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారని వెల్లడించారు.
మావోయిస్టు నేత హిడ్మా ఎన్‌కౌంటర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



