నవతెలంగాణ-జనగామ
దండకరణ్య స్పెషల్ జోనల్ కమిటీ సౌత్ బస్తార్ పరిధిలోని మావోయిస్టు చైతన్య నాట్య మంచ్ నాయకుడు లోకేటి రమేశ్ అలియాస్ అశోక్ అలియాస్ ఏ. నరేందర్ అలియాస్ ఏ. రాజేశ్వర్ మంగళవారం జనగామ పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ సందర్భంగా జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనారోగ్య సమస్యలు, భద్రతా దళాల నిరంతర ఒత్తిడి, తదితర కారణాలతో రమేశ్ లొంగిపోయినట్టు తెలిపారు. లోకేటి రమేశ్.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇస్రోజివాడకు చెందిన లోకేటి రమేశ్.. రెండు దశాబ్దాలుగా సౌత్ బస్తర్ ప్రాంతంలో నిషేధిత సీపీఐ(మావోయిస్టు)లో పని చేసినట్టు చెప్పారు. రమేష్ పై రూ.8 లక్షల రివార్డు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పిలుపుమేరకు మావోయిస్టులందరూ జనజీవన స్రవంతిలో కలవాలని డీసీపీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జనగామ ఏసీపీ పండరి చేతన్ నితిన్, స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ భీమ్ శర్మ, జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి, రఘునాథ్‌పల్లి సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌ఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
మావోయిస్టు నేత లొంగుబాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



