నవతెలంగాణ-హైదరాబాద్ : విజయవాడలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపాయి. నగర శివారులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు.
కానూరు కొత్త ఆటో నగర్‌లోని ఓ భవనాన్ని మావోయిస్టులు షెల్టర్‌గా మార్చుకున్నారనే సమాచారంతో కేంద్ర బలగాలు మంగళవారం ఉదయం సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేసిట్. అరెస్టయిన వారిలో 12 మంది మహిళలు, నలుగురు కీలక హోదాల్లోని వ్యక్తులుగా సమాచారం. మరో 11 మంది మావోయిస్టు సానుభూతిపరులు, మిలీషియా సభ్యులు ఉన్నట్లో తెలుస్తోంది. స్థానిక పోలీసులు, గ్రేహౌండ్స్ ప్రత్యేక బలగాలు కలిసి ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి.
ఇదిలా ఉంటే అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఆరుగురు కీలక మావోయిస్టులు మరణించారు. మృతుల్లో మావోయిస్టు టాప్ లీడర్ హిడ్మా, అతని సతీమణి హేమ ఉన్నారు. మరో అగ్రనేత ఆజాద్ కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందినట్లు తెలుస్తోంది. హిడ్మా దంపతుల మరణాన్ని ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ధ్రువీకరించారు.



