Wednesday, August 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో మారం జగదీశ్వర్ జన్మదిన వేడుకలు

టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో మారం జగదీశ్వర్ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణ ఉద్యోగుల రాష్ట్ర టి జి ఈ జె ఏ సి  చైర్మన్, టీఎన్జీవోస్ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ జన్మదిన వేడుకలను టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్జీవోస్ భవనంలో జిల్లా శాఖ అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి అధ్యక్షతన కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించి, మారం జగదీశ్వర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న సేవలను కొనియాడారు. ఉద్యోగుల ఐక్యతతో రాష్ట్ర అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షుడు ఎం. చక్రధర్, జిల్లా కోశాధికారి ఎం. దేవరాజు, కేంద్ర సంఘం కార్యవర్గ సభ్యుడు కే. శివకుమార్, ఉపాధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, సంయుక్త కార్యదర్శులు గణేష్, రాజమణి, కల్చరల్ సెక్రటరీ రాజ్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్‌కుమార్, కామారెడ్డి అర్బన్ తాలూకా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -