నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణ ఉద్యోగుల రాష్ట్ర టి జి ఇ జేఏసీ చైర్మన్ టీఎన్జీవోస్ రాష్ట్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ పుట్టినరోజును వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈక్రమంలో టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి అధ్యక్షతన కామారెడ్డి కేంద్రంలోని స్థానిక షెడ్యూలు కులాల బాలుర వసతి గృహంలో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎమ్. నాగరాజు, జిల్లా కోశాధికారి ఎమ్. దేవరాజు, ఉపాధ్యక్షులు లక్ష్మణ్, రాజ్యలక్ష్మి, ఎంసీ పోచయ్య, వెంకటేష్, సంయుక్త కార్యదర్శులు అబ్దుల్ ఖాదిర్, రాజమణి, కల్చరల్ సెక్రటరీ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో మారం జగదీశ్వర్ జన్మదిన వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES