Saturday, October 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మార్బుల్స్ హమాలీ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక

మార్బుల్స్ హమాలీ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ – మిర్యాలగూడ 
మార్బుల్ హమాలి యూనియన్ నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నారు. రాధిక మార్బుల్ షాపులో ఉన్న హమాలీలు యూనియన్ కన్వీనర్ గా మట్టపల్లి, కో కన్వీనర్ గా అంజి నీ ఎనకున్నారు. అదేవిధంగా దేవన్నారాయణ మార్బుల్ షాపులో హమాలీలు కన్వీనర్ గా మూడవత్ బాలు ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ హమాలీలు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలన్నారు. హమాలీల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు సంఘం పోరాడుతుందన్నారు. హమాలీల నూతన కమిటీలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో హమాలీలు వెంకటేష్, నాగార్జున, సందీప్, కాలేశ్వరం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -