Monday, December 8, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవిస్తరిస్తోన్న మార్బర్గ్ వైరస్.. 8 మంది మృతి

విస్తరిస్తోన్న మార్బర్గ్ వైరస్.. 8 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : దక్షిణ ఇథియోపియాలో ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ వ్యాప్తి చెందుతోంది. డిసెంబర్ 3 నాటికి 13 కేసులు నమోదుకాగా అందులో 8 మంది మృతి చెందినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా ఈ వైరస్ ఎబోలా కుటుంబానికి చెందినదిగా, మరణాల రేటు 88% వరకు ఉండొచ్చని WHO తెలిపింది. ప్రస్తుతం టీకా లేదా ప్రత్యేక చికిత్స అందుబాటులో లేదు. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట వంటి లక్షణాలు ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -