Tuesday, September 16, 2025
E-PAPER
Homeసినిమావినూత్న కాన్సెప్ట్‌తో 'మారెమ్మ'

వినూత్న కాన్సెప్ట్‌తో ‘మారెమ్మ’

- Advertisement -

రవితేజ సోదరుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్‌ రూరల్‌ రస్టిక్‌ మూవీ ‘మారెమ్మ’తో హీరోగా సినిమాల్లోకి అడుగు పెడుతున్నారు. మంచాల నాగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.
మోక్ష ఆర్ట్స్‌ బ్యానర్‌పై మయూర్‌ రెడ్డి బండారు తమ ప్రొడక్షన్‌ నెం.1గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. హీరో మాధవ్‌ బర్త్‌ డే సందర్భంగా మేకర్స్‌ స్పెషల్‌ పోస్టర్‌, గ్లింప్స్‌ని రిలీజ్‌ చేశారు. పోస్టర్‌లో మాధవ్‌ ఇంటెన్స్‌, రగ్గడ్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. మాధవ్‌ కబడ్డీ కోర్ట్‌లో అడుగుపెడుతున్నట్లుగా ప్రజెంట్‌ చేసిన గ్లింప్స్‌ పవర్‌ఫుల్‌గా ఉంది. విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ టాప్‌ నాచ్‌లో ఉండటంతో అందరి దగ్గర్నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. ‘మా హీరో మాధవ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం ఆయనకు హీరోగా మంచి భవిష్యత్‌ను ఇస్తుందనే నమ్మకం ఉంది.

ఇందులో ఆయన పోషించిన పాత్ర ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేస్తుంది. ఓ మంచి కాన్సెప్ట్‌తో అద్భుతమైన చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రంలో మాధవ్‌ సరసన దీపా బాలు కథానాయికగా నటిస్తుండగా, వినోద్‌ కుమార్‌, వికాస్‌ వశిష్ట, దయానంద్‌ రెడ్డి, వి.ఎస్‌.రూప లక్ష్మి ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రచన- దర్శకత్వం: మంచాల నాగరాజ్‌, నిర్మాత: మయూర్‌ రెడ్డి బండారు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఉమేష్‌ విలాసాగరం, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: కుశాల్‌ రెడ్డి కందాలా, డీవోపీ: ప్రశాంత్‌ అంకిరెడ్డి, సంగీతం : ప్రశాంత్‌ ఆర్‌ విహారి, ఎడిటర్‌: దేవ్‌ రాథోడ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రాజ్‌ కుమార్‌ మురుగేషన్‌, యాక్షన్‌ డైరెక్టర్‌: మాడిగొండ నటరాజ్‌, కొరియోగ్రాఫర్‌: సాగ్గీ సాగర్‌, సాహిత్యం: మిట్టపల్లి సురేందర్‌, కమల్‌ ఎస్లావత్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -