– రెండు కేసుల్లో 9 మందిపై కేసు నమోదు
– ఒక మహిళ అరెస్టు, పరారీలో మిగతా నిందితులు
నవతెలంగాణ- బాలానగర్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఫతేనగర్‌లో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి అక్రమ నిల్వ, విక్రయంపై అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్టీఎఫ్ ‘ఏ’ బృందం బాలానగర్ ఎక్సైజ్ పోలీసులతో కలిసి ఆదివారం రాత్రి సంయుక్తంగా దాడులు నిర్వహించింది. ఈ ఘటనకు సంబంధించి రెండు గ్రూపులకు చెందిన నిందితులపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. మొత్తం 9 మందిపై కేసులు నమోదు చేశారు. మొదటి కేసులో 2.1.054 కిలోల గంజాయి సీజ్ చేశారు. ఈ కేసులో నలుగురిపై కేసు నమోదు చేయగా, ఫతేనగర్‌కు చెందిన కె. రాఖీ దేవి అనే మహిళా పెడ్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురు నిందితులు కాళీవాల వరలక్ష్మి అలియాస్ వరమ్మ, కాళీవాలన్ అలియాస్ సుదర్శన్ (పెడ్లర్లు), ఎస్లీ కవిత (సప్లయర్) పరారీలో ఉన్నారు. ఇక రెండో కేసులో 1.054 కిలోల ఎండు గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. శక్తి రోజా, శక్తి రాశి, శక్తి మల్లికార్జున్, శక్తి భూమిక, శక్తి రూపేష్ అలియాస్ విఘ్నేష్ కుమార్ పరారీలో ఉన్నారు. ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఫతేనగర్ పరిసర ప్రాంతాల్లోని వినియోగదారులకు విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అరెస్టు చేసిన నిందితురాలు, స్వాధీనం చేసుకున్న గంజాయి, ఇతర వస్తువులతో పాటు కేసు పత్రాలను తదుపరి దర్యాప్తు నిమిత్తం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్, బాలానగర్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించినట్టు అధికారులు తెలిపారు.
ఫతేనగర్‌లో గంజాయి పట్టివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



