నవతెలంగాణ – భువనగిరి
జిల్లా కేంద్రంలోని శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాల విద్యార్థి మరికొండ గణేష్ జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 13 నుండి 17 వరకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని పాట్నాలో జరుగు 69 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పోటీలలో a అండర్ 17 1500 మీ అథ్లెటిక్స్ లో పాల్గొననున్నారు. మంగళవారం స్థానిక శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మధిర మల్లేశం గణేష్ ను అభినందించి మేమేంటో అందజేసి శాలువాతో సన్మానం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. జాతీయస్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తేవాలన్నారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి గోపాల్ పర్యవేక్షణలో గణేష్ శిక్షణ పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి మాజీ అధ్యక్షులు బండారి శ్రీనివాసరావు అధ్యాపకులు పాల్గొన్నారు.


