Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeసినిమాక్రిస్మస్‌ కానుకగా 'మార్క్‌' రిలీజ్‌

క్రిస్మస్‌ కానుకగా ‘మార్క్‌’ రిలీజ్‌

- Advertisement -

హీరో కిచ్చా సుదీప్‌ నటిస్తున్న 47వ చిత్రానికి ‘మార్క్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. బుధవారం ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు.
ఈ చిత్రాన్ని టీజీ త్యాగరాజన్‌ సమర్పణలో సత్యజ్యోతి ఫిలింస్‌, కిచ్చా క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సెంథిల్‌, త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. భారీ యాక్షన్‌ డ్రామా కథతో దర్శకుడు విజయ్‌ కార్తికేయ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా క్రిస్మస్‌ పండగ కానుకగా పాన్‌ ఇండియా స్థాయిలో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ పవర్‌ఫుల్‌గా ఉండి ఆకట్టుకుంటోంది. మ్యాడ్‌, ఆటిట్యూడ్‌, రూత్‌ లెస్‌, కింగ్‌…అంటూ మార్క్‌ పేరులోని అక్షరాలకు డెఫినేషన్‌ ఇచ్చారు. ఈ గ్లింప్స్‌లో అజయ్‌ మార్కండేయ పాత్రలో కిచ్చా సుదీప్‌ను ఇంటెన్స్‌ లుక్‌లో పరిచయం చేశారు. ఆయన క్యారెక్టర్‌ పేరుతోనే టైటిల్‌ ‘మార్క్‌’ ఉండబోతోంది. ఈ గ్లింప్స్‌కు అజనీష్‌ లోకనాథ్‌ అందించిన బీజీఎం ఆకర్షణగా నిలుస్తోంది. కిచ్చా సుదీప్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకుల దష్టిని బాగా ఆకర్షిస్తోంది అని చిత్ర బృందం తెలిపింది.
‘మా కథానాయకుడు ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ అటు అభిమానులను, ఇటు ప్రేక్షకులను అలరిస్తున్నారు. వాటి తరహాలోనే ‘మార్క్‌’ సినిమా ఉంటుంది. నటన పరంగా ఇందులో ఆయన నట విశ్వరూపం చూడబోతున్నారు. ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేస్తుందనే నమ్మకంతో ఉన్నాం’ అని మేకర్స్‌ చెప్పారు.
కిచ్చా సుదీప్‌, విక్రాంత్‌, నవీన్‌ చంద్ర, దీప్షిక, రోహిణీ ప్రకాష్‌ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి డీవోపీ – శేఖర్‌ చంద్ర, ఎడిటర్‌ – ఎస్‌ఆర్‌ గణేష్‌ బాబు, కొరియోగ్రాఫీ- శోభి పాల్‌ రాజ్‌, యాక్షన్‌ – సుప్రీమ్‌ సుందర్‌, కెవిన్‌ కుమార్‌, విక్రమ్‌ మోర్‌, మ్యూజిక్‌ – అజనీష్‌ లోకనాథ్‌, సమర్పణ – టీజీ త్యాగరాజన్‌, నిర్మాతలు – సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌, రచన, దర్శకత్వం – విజయ్‌ కార్తికేయ.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad