నవతెలంగాణ – కాటారం
శనివారం సాయంత్రం 8 గంటల 30 నిమిషాల సమయంలో కాటారంలో దుర్గం సరళ అనే మహిళ ఫ్యాన్ కి ఉరి వేసుకొని అనుమానాస్పదంగా మృతి చెందింది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం… మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అంగరాజపల్లి గ్రామానికి చెందిన దుర్గం సరళ(30) సం, జాడి రాజేష్ (19) సం ప్రేమ వివాహం చేసుకున్నారు. జీవనోపాధి కోసం కాటారంలో ఉంటున్నారు. సరళ కన్నా వయసులో రాజేష్ చిన్నవాడు కావడంతో వారి వివాహం రాజేష్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులుకు ఇష్టం లేక అతడిని రెచ్చగొట్టి సరళను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేశారు. దీంతో తట్టుకోలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దుర్గం లక్ష్మణ్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
వివాహిత ఆత్మహత్య..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES