వాషింగ్టన్ : డెట్రాయిట్ నగర మేయర్‌గా తొలిసారి మహిళా నేత, సిటీ కౌన్సిల్ అధ్యక్షురాలు మేరీ షెఫీల్డ్ ఎన్నికయ్యారు. ఆమె తన ప్రత్యర్థి, ప్రముఖ మెగా చర్చ్ పాస్టర్ రెవరెండ్ సోలోమన్ కిల్నోచ్‌ని మంగళవారం జరిగిన ఎన్నికలలో ఓడించారు. మూడు సార్లు డెట్రాయిట్ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించిన మైక్ డగ్గన్ స్థానంలో ఆమె జనవరిలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికలలో తిరిగి పోటీ చేయబోనని ఆయన గతేడాదే ప్రకటించారు. డగ్గన్ ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా మిచిగాన్ గవర్నర్ పదవి రేసులో ఉన్నారు. డెట్రాయిట్ నగరం అమెరికా చరిత్రలో దివాలా తీసిన అతి పెద్ద మున్సిపాలిటీ. అయితే 2014లో ఆ పరిస్థితి నుంచి బయటపడింది. ఆ తర్వాత పరిస్థితులు క్రమేపీ మెరుగయ్యాయి. కాగా మేయర్ పదవికి పోటీ పడిన షెఫీల్డ్, కిల్నోచ్…వీరిద్దరూ డెమొక్రాట్లే. షెఫీల్డ్ అభ్యర్థిత్వానికి డగ్గన్ మద్దతు తెలిపారు.
డెట్రాయిట్ తొలి మహిళా మేయర్‌గా మేరీ షెఫీల్డ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



