Saturday, October 25, 2025
E-PAPER
Homeఖమ్మండ్రగ్స్ నిర్మూలనలో భాగంగా భారీ కార్డాన్ సెర్చ్

డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా భారీ కార్డాన్ సెర్చ్

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట: జిల్లా ఎస్పీ బి. రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు “చైతన్యం – డ్రగ్స్ పై యుద్ధం” కార్యక్రమాన్ని మరింత బలపరుస్తూ శనివారం అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని వడ్డెర బజార్‌ లో పోలీసులు భారీ స్థాయిలో నాకాబంది, కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సీఐ నాగరాజు రెడ్డి పర్యవేక్షణలో ఉదయం నుంచే పోలీసులు ప్రాంతాన్ని ముట్టడి చేసి వాహనాలు, అనుమానితులను తనిఖీ చేశారు.
ఈ సోదాల్లో 70 మోటార్ సైకిళ్లు, 4 ఆటోలు, 4 కార్లు, 6 ట్రాక్టర్లు, 2 లారీలు, బెల్టు షాపులపై తనిఖీ చేసి 16 లీటర్ల మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నరు. ఆధారాలు లేని వాహనాలను తాత్కాలికంగా స్వాధీనం చేసుకుని పత్రాలు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తరువాత అదే కాలనీలో యువకులు, విద్యార్థులను సమీకరించి సీఐ నాగరాజు రెడ్డి సంభాషిస్తూ.. మాదకద్రవ్యాలు జీవితాలను నాశనం చేస్తాయి. సమాజం బాధ్యతగా యువత జాగ్రత్తగా ఉండాలి.అని హెచ్చరించారు. తల్లిదండ్రులు, పెద్దలు కూడా బాధ్యతగా పర్యవేక్షించాలని సూచించారు.

డ్రగ్స్‌ పై ప్రజల్లో చైతన్యం పెంపొందించడం, నేరాలను అరికట్టడం లక్ష్యంగా రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాంటి చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట, దమ్మపేట ఎస్‌.హెచ్‌.ఓ లు, ఎస్సైలు యయాతి రాజు, సాయి కిశోర్ రెడ్డి, అదనపు ఎస్ఐ ఊకే రామ్మూర్తి, శిక్షణ ఎస్ఐ అఖిల, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -