Wednesday, January 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంజపాన్‌లో భారీ భూకంపం…రిక్టరు స్కేలుపై 6.2 తీవ్రత

జపాన్‌లో భారీ భూకంపం…రిక్టరు స్కేలుపై 6.2 తీవ్రత

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: జపాన్‌లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున పశ్చిమ జపాన్‌ తీరంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.2గా నమోదైనట్లు జపాన్‌ వాతావరణ సంస్థ తెలిపింది. షిమనే ప్రిఫెక్చర్‌లో ఉదయం 10:18 గంటలకు ప్రకంపనలు చోటు చేసుకున్నట్టు పేర్కొంది.

అయితే, ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అక్కడి అధికారులు తెలిపారు. అలాగే, ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు కూడా లేదని స్పష్టం చేశారు. భూకంపం ధాటికి పలు భవనాలు ఊగిపోయాయి. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -