- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : చత్తీస్‌గఢ్, నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్ర నాయకులు ఉన్నట్లు సమాచారం. మరికొంత మంది మావోయిస్టులు ఎదురు కాల్పులలో గాయాలు కావడంతో తప్పించుకున్నారు. ఈ క్రమంలో తప్పించుకున్న మావోయిస్టుల గురించి బలగాలు గాలిస్తున్నారు. ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. సంఘటన స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి లభ్యమయ్యాయి.
- Advertisement -