Wednesday, July 30, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంచైనాలో భారీ వరదలు

చైనాలో భారీ వరదలు

- Advertisement -

34 మంది మృతి..84 వేలమంది
సురక్షిత ప్రాంతాలకు తరలింపు
రంగంలోకి దిగిన సహాయక బృందాలు

చైనాను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. వీటి కారణంగా బీజింగ్‌లో ఇప్పటివరకు 34 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 80వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఈమేరకు అక్కడి మీడియా కథనాలను వెల్లడిస్తున్నాయి. రాజధాని బీజింగ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మియున్‌ జిల్లా వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడ 28 మంది, యాంకింగ్‌ జిల్లాలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పొరుగునున్న హెబీ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడి నలుగురు మరణించారు. ఈక్రమంలో పలువురి ఆచూకీ గల్లంతయ్యింది. ఇక, బీజింగ్‌లోని 80వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిం చారు. వీరిలో మియున్‌కు చెందినవారే 17వేల మంది ఉన్నారు. లువాన్‌పింగ్‌ కౌంటీ లోని గ్రామీణ ప్రాంతంలో కూడా కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో కొంతమంది ప్రజలు అక్కడే చిక్కుకుపోయారు. నదుల్లో వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తుం డటంతో దిగువన ఉండే ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికా రులు హెచ్చరించారు. పెద్దఎత్తున కురుస్తున్న వర్షాల కారణంగా చెట్లు కూలిపోయాయి. విద్యుత్తు స్తంభాలు దెబ్బతినడంతో.. పలు ప్రాంతాలు చీకటి మయమయ్యాయి. హెబీలోని లువాన్‌పింగ్‌ కౌంటీ సరిహద్దుల్లో పలు కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ భారీ వర్షాలు, వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించాయని చైనా ప్రధానమంత్రి లి క్వియాంగ్‌ పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -